సమంతకు కాబోయే అత్త-మామలు వార్నింగ్

Samantha uncle and aunt warns her

10:30 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Samantha uncle and aunt warns her

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న టాప్ హీరోయిన్ సమంత. అయితే గత కొద్ది రోజులుగా సమంత పెళ్లి గురించి విపరీతంగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు స్వయంగా స‌మంతానే పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది. తాను ఓ వ్య‌క్తితో డీప్ ల‌వ్‌లో ఉన్నాన‌ని, అత‌డు త‌న‌కు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉన్న ఓ యంగ్ హీరో అని చెప్పింది. స‌మంత చెప్పిన మాట విన్నాక చాలా మందికి స‌మంత చేసుకోబోయే హీరో ఎవ‌రో క్లారిటీ వ‌చ్చేసింది. టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీకి చెందిన ఓ టాప్ హీరో కుమారుడు అని చాలా మంది ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

ఇదిలా ఉంటే గ‌తంలో కూడా స‌మంత త‌మిళ హీరో సిద్ధార్థ్‌తో ప్రేమ‌లో ప‌డి అది బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా స‌మంత తెలుగు అగ్ర‌హీరో కొడుకునే పెళ్లాడుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. యంగ్ హీరో అయిన స‌మంత ప్రేమికుడు కూడా ఆమెను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడ‌ట‌. అయితే ఈ విషయం పై ఇప్పటికే వాళ్లింట్లో చర్చ జరుగుతోందని సమాచారం. స‌మంత‌, ఆ హీరో పెళ్లి చేసుకోవాలంటే స‌మంత‌కు మామ అయిన ఆ స్టార్ హీరో, ఒకప్పటి హీరోయిన్ అయిన స‌మంత అత్త స‌మంత‌కు కొన్ని విష‌యాల్లో వార్నింగ్‌లు ఇచ్చి కొన్ని కండీష‌న్లు పెట్టిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అత్త మామ‌లు ఓకే చెపితే స‌మంత సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలెక్కేయాల‌ని చూస్తోంది. హీరో కూడా ఎక్కడా బయటకు లీక్ కాకుండా చూసుకుంటున్నాడు. అయితే స‌మంత పెళ్లికి ఇంకా అత్త‌మామ‌ల నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేద‌ట‌. పెళ్లి తర్వాత సినిమాలు చేసే విష‌యంలో స‌మంత‌కు ఆమెకు కాబోయే అత్త‌, మామ‌ల‌కు కాస్త తేడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇక‌ పై సినిమాల్లో ప‌ద్ధ‌తిగా ఉండాల‌ని కూడా వారు వార్న్ చేసిన‌ట్టు టాక్‌. మరి ఈ ప్రేమ కథకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియదు. సమంత మాత్రం సదరు యంగ్ హీరోను తొందర పెడుతుందట. అయితే అటు స‌మంత‌కు కాబోయే అత్త‌మామ‌లు మాత్రం త‌మ కొడుకుతో ఆమె పెళ్లి విష‌యంలో కొన్ని కండీష‌న్లు పెడుతున్నాడ‌ట‌.

English summary

Samantha uncle and aunt warns her