ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

Samantha want to take some rest

10:49 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Samantha want to take some rest

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏ మాయ చేశావె' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన సమంత తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. మొదటి సినిమాలోనే అదర చుంభనాలతో రెచ్చిపోయింది. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అటు కోలీవుడ్ లో కూడా సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

తన అందచందాలతో, అభినయంతో అనతి కాలంలోనే టాప్ ప్లేస్ కి చేరుకుంది సమంత. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ హాట్ బ్యూటీ బిజీబిజీగా ఉంది. అయితే సమంత కాస్త రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటోంది. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. కొద్ది రోజులు హాలీడే తీసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో తేరి, 24.. టాలీవుడ్ లో బ్రహ్మోత్సవం, అ ఆ.. చిత్రాల్లో సమంత నటించింది. ఇక జూ. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ లోనూ సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఆ మూవీ తర్వాత మరో సినిమాకు డేట్ లు ఇవ్వకూడదని సమతం ఫిక్స్ అయింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానంటోంది ఈ హాట్ బ్యూటీ.

English summary

Samantha want to take some rest. Hot beauty Samantha want to take some gap and rest for movies. After the Janatha Garage shooting Samantha want to take some rest.