అర్జంటుగా కూతురు కావాలట

Samantha wants Daughter

09:42 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Samantha wants Daughter

ఇది ద్వాపర యుగంలో కుంతీ దేవి సూర్యుణ్ణి కోరినట్లు కోరిన కోరిక కాదు. అప్పటి మాదిరిగా తీర్చే కోరికా కాదు. మరి ఏమిటంటే,  టాలీవుడ్‌ లో బోల్డన్ని సినిమాలు చేస్తున్న  సమంతకు అర్జెంటుగా కూతురు కావాలట. అదీ కేవలం రోజుల్లోనే...  ఇంకా చెప్పాలంటే,  శనివారం లోగా.... స్వయంగా ఈ భామ ట్వీట్‌  చేస్తూ ,  "నాకో బేబీ కావాలి.. ఇప్పుడెలా అరెంజ్‌ చేయాలి" అని అడిగుతోంది.  ఇంతకీ సమంతకు ఇంత అర్జెంటుగా బేబీ కావాల్సిన అవసరం ఏమై ఉంటుందో తెల్సుకోవాలని ఉందా ? ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్‌బాబుకు జంటగా సమంత, కాజల్‌, ప్రణీత నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. ఓ బుల్లి సెలబ్రిటీకి ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ డేట్‌ ఇచ్చేసింది. ఈ శనివారం తనతో గడిపేందుకు ప్రామిస్‌ చేసేసింది. ఇంతకీ ఆ చిన్నారి సెలబ్రిటీ ఎవరంటే,  బ్రహ్మోత్సం హీరో మహేష్‌ ముద్దుల కుమార్తె  సితార. "వచ్చే శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్‌ ఫిక్స్‌ చేసిందట. అయితే తనతో ఆడుకోవడానికి ఈమె బేబీని కూడా వెంట బెట్టుకుని రమ్మందట. మరి ఈ భామకేమో ఇంకా పెళ్లి కాలేదు.అలాంటప్పుడు శనివారంలోగా బేబీని ఎరేంజ్ చేయడం కష్టమేగా. అందుకే " బేబీని ఎలా అరేంజ్‌ చేయాలి" అంటూ సితారతో దిగిన ఫొటోను జత చేసి మరీ సమంత  సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ఆడియో వేడుకకి పంచెకట్టులో మహేష్‌

కన్న బిడ్డలను హతమార్చిన తల్లి

'బ్రహ్మోత్సవం'లో డైలాగ్స్‌.. .

ఇంట్లో ఎవరూ లేనప్పుడు సమంత చేసేపని అదా !

1/8 Pages

ప్రామిస్‌

‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. ఓ బుల్లి సెలబ్రిటీకి ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ డేట్‌ ఇచ్చేసింది. ఈ శనివారం తనతో గడిపేందుకు ప్రామిస్‌ చేసేసింది

English summary

Samantha was acting in the movie Brahmotsavam with Super Star Mahesh Babu under the direction of Srikanth Addaala. Recently Mahesh Babu Daughter Sitara Visited Brahmotsavam Shooting Set and played joyfully with Samantha and asked samantha to come to her home on this Saturday with her daughter.Samantha posted this pic on twitter.