పవన్‌ తో అంత ఈజీ కాదు..!

Sampath Nandi About Pawankalyan

03:54 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Sampath Nandi About Pawankalyan

రచ్చ సినిమా ఫేం సంపత్‌ నంది ఏమైంది ఈవేళ్ళ చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కొద్ది కలానికే మోగా ఫోన్ పట్టుకున్నాడు. పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రచ్చ సినిమాకి దర్శకత్వం వహించి మాస్‌ జనాలకు మరింత దగ్గరయ్యాడు . రచ్చ సినిమా చేసిన తరువాత పవణ్‌ కళ్యాణ్‌ హీరోగా గబ్బర్‌సింగ్‌ -2 కు దర్శకత్వం వహిస్తాడని అంతా భావించారు కానీ ఉన్నట్టుండి ఆ సినిమా వేరే దర్శకుడితో మొదలుకావడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇది ఇలా ఉండగా సంపత్‌నంది ఎక్కడికి వెళ్ళినా పవణ్‌కళ్యాణ్‌ గారితో సినిమా ఏప్పడు మొదలవుతుందన్న ప్రశ్న ఎక్కువ కావడంతో సంపత్‌నంది స్పందిస్తూ 'పవన్‌ గారితో సినిమా చెయ్యాలంటే కథ మాత్రమే ఉంటే సరిపోదని, పవన్‌ గారికి స్క్రిప్టు మొత్తం నచ్చాలని, పవన్ గారి కాల్ షీట్లు కూడా దొరకాలని అన్నాడు. పవన్‌ కళ్యాణ్‌ గారి దగ్గరకి ఒక సరైన కథతో వెళ్ళి కలుస్తాని 'అన్నాడు . ప్రస్తుతం రవితేజ తో చేసిన బెంగాల్‌టైగర్‌ సినమా రిలీజ్‌ పైనే తన దృష్టి అంతా ఉందని తన ఫ్యుచర్‌ ప్రాజెక్టుల గురించి త్వరలోనే చెబుతానని మీడియా అడిగిన ప్రశ్నలకు సంపత్ నంది సమాధానంగా చెప్పాడు.

English summary

Director sampath nandi says that he will defenately say the suitable story line to pawan kalyan and the story have to accept by pawankalyan