10 కోట్లు 'నంది'!

Sampath Nandi remmuneration 10 crores

06:35 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Sampath Nandi remmuneration 10 crores

వరుణ్‌ సందేశ్‌ నటించిన 'ఏమైంది ఈవేళ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంపత్‌నంది ఈ చిత్రం విజయంతో యూత్‌కి బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత రామ్‌చరణ్‌ తేజ్‌తో 'రచ్చ' చిత్రం తీసి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టాడు. తాజాగా మాస్‌ మహరాజ్‌ రవితేజ తో 'బెంగాల్‌ టైగర్‌' చిత్రం తీసి హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన డైరెక్టర్‌ అంటున్నారు. సినిమా స్టోరీ టాక్‌ ఎలా ఉన్నా ఓపినింగ్‌ కలెక్షన్స్ మాత్రం దుమ్ము రేపుతున్నాయి. స్టోరీ ఎలా ఉన్న రవితేజ తరహా యాక్షన్, కామెడీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. హీరోయిన్స్‌ తమన్నా, రాశీఖన్నా ఈ చిత్రంలో పోటీ పడి మరీ తమ అందాలు ప్రేక్షకులకి వడ్డించారు.

అంతే కాకుండా రాశీఖన్నా ఇందులో బికినీ వేసి కుర్రాళ్లకి పిచ్చెక్కించేసింది. భీమ్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందరినీ బాగా అలరిస్తుంది. ఈ చిత్రంతో సంపత్‌ నంది రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. తన తరువాత చిత్రం నుంచి 10 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడని సమాచారం. ఇప్పుటికే టాలీవుడ్‌ నిర్మాతలు ఎంతో మంది సంపత్‌ వెనకాల క్యూ కూడా కడుతున్నారు.

English summary

Sampath Nandi taking remmuneration 10 crores after Bengal Tiger success.