ఆండ్రాయిడ్‌' గా అదరగొడుతున్న సంపూ

Sampoornesh Babu as Androidu

04:15 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu as Androidu

'2014లో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ కామెడీ హీరోగా మారిపోయిన బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఆ తరువాత కరెంట్‌ తీగ, బందిపోటు, వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్, జ్యోతిలక్ష్మీ, పెసరట్టు వంటి చిత్రాల్లో స్పెషల్‌ క్యారెక్టర్స్‌ చేసి అలరించాడు. ఆ తరువాత మళ్లీ మంచు విష్ణు నిర్మించిన 'సింగం 123' చిత్రంలో హీరోగా నటించి తన కామెడీతో అందరినీ ఆదరగొట్టాడు. ఇప్పుడు మళ్లీ 'కొబ్బరిమట్ట' చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో సంపూ ఏకంగా మూడు గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. టైటిల్‌ తోనే కామెడీ పండిస్తున్న సంపూ ఇంక సినిమాలో ఇంకెంత కామెడీని చూపిస్తాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇందులో 'పెదరాయుడు' అనే క్యారెక్టర్‌ కి సంబంధించిన లుక్‌ ఇప్పటికే విడుదలై అందరినీ అలరించింది. ఇప్పుడు తాజాగా 'ఆండ్రాయిడు' అనే పాత్రకి సంబంధించిన లుక్‌ ని విడుదల చేశారు. ముఖం కనిపించకుండా కేవలం స్టైలిష్‌ బైక్ పైన కూర్చుని బుజం వరకు కనిపిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

1/5 Pages

English summary

Burning Star Sampoornesh Babu as Androidu in Kobbari Matta movie. In this movie Sampoornesh Babu is acting in 3 roles.