చెన్నై వరద భాదితులకు సంపూ 50 వేల విరాళం 

Sampoornesh Babu Donates 50,000 To Chennai

08:30 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Sampoornesh Babu Donates 50,000 To Chennai

భారి వర్షాలతో అతలాకుతలమైన చెన్నై మహానగరాన్ని ఆడుకోవడానికి సంపూర్నేష్ బాబు తాజ్న వంతు సహాయం చేసాడు. తుఫాన్ కారణంగా చెన్నై మొత్తం నీట మునిగింది. రవాణా , సమాచార వ్యవస్థ లు కుడా దెబ్బతిన్నాయి. ఒక వైపు తమిళనాడు సిఎమ్ జయ లలిత వీలైనన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

తుఫాన్ భాదితులకు సహాయార్ధం చెన్నై చిత్ర సీమ ముందుకు వచ్చింది. కోలీవుడ్ నటుడు ఒక్కోక్కరుగా ముందుకు వస్తున్నారు. తమిళ హీరో సూర్య త స్వచ్చంద సంస్థ తరఫున 50 లక్షల విరాళాన్ని అందించాడు. కొత్త గా నడిఘర్ సంగం సెక్రటరీ ఎన్నికైన విశాల్ 10 లక్షలు , రజినీకాంత్ అల్లుడు ధనుష్ 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా టాలీవుడ్ కామెడీ హీరో సంపూర్నేష్ బాబు 50 వేల సహాయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ వైజాగ్ హూద్ హూద్ తుఫాన్ బాధితులకు తమిళ నటులు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించారని ఇప్పుడు తెలుగు నటులు కుడా ముందుకు వచ్చి చెన్నై బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసాడు. మొత్తానికి సంపూ ముందుకు వచ్చి చెన్నై బాదితులను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం.

English summary

Tollywood Comedy hero sampoornesh babu donates 50 thousand rupees to chennai flood victims