తనలా డైలాగ్ చెప్పాడని సంపూని అభినందించిన చిరు!

Sampoornesh Babu impresses Chiranjeevi with his dialogue delivery

12:04 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu impresses Chiranjeevi with his dialogue delivery

ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక్క నిముషం పాటు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అప్పట్లో అది పెద్ద చర్చగా మారింది కూడా. సేమ్ అలానే ఇప్పుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా తన డైలాగ్ డెలివరీతో మెగాస్టార్ చిరంజీవిని సైతం ఇంప్రెస్ చేశాడు. సంపూ తాజాగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం టీజర్లో సంపూ.. ఆడజన్మ అంటే.. అనే భారీ డైలాగ్‌ని గుక్క తిప్పుకోకుండా నిమిషం పైగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒకటిన్నర నిముషమున్న ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో ఏడు లక్షల మందికి పైగా చూశారట.

హైదరాబాద్ లోఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంపూర్ణేష్ బాబు.. తన స్మార్ట్ ఫోన్లో దీన్ని చిరంజీవికి చూపించాడని, దీనిని ఆసక్తిగా చూసిన చిరు.. అద్భుతంగా చెప్పాడని సంపూని మెచ్చుకున్నాడని టాక్. పెదరాయుడు గెటప్‌లో సంపూ ఇందులో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు కళ్ళు తెరచి వారి భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలన్నది ఈ డైలాగ్ సారాంశం. మొత్తం మీద సంపూ మెగాస్టార్ చిరంజీవిని సైతం ఇంప్రెస్ చెయ్యగలిగాడంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.

English summary

Sampoornesh Babu impresses Chiranjeevi with his dialogue delivery.