సదా నా ప్రేమకు నేనే బానిసను...

Sampoornesh Babu Self Birthday Wishes

11:46 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu Self Birthday Wishes

తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘హృదయ కాలేయం’తో సెల్ఫ్ హైప్ క్రియేట్ చేసుకుని, మళ్ళీ ‘కొబ్బరిమట్ట’ సినిమాతో నవ్వించడానికి రెడీ అయ్యాడు. సోమవారం బర్నింగ్‌స్టార్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఆయనకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తనకుతానే స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుని బర్నింగ్ స్టార్ స్పెషాలిటీ చాటుకున్నాడు."సదా నా ప్రేమకు నేనే బానిసను" అంటూ వెరైటీ ట్యాగ్‌లైన్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు కేక్ కట్ చేస్తున్న ఫోటోతో పాటు ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఇది చూసిన వాళ్లంతా ఇది మట్టా తెలివి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

ఇవి కూడా చదవండి:ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

English summary

Burning Star Sampoornesh Babu was become famous for his way of comedy in his movies and he recently acted in a movie named "Kobari Matta" and he wished himself and posted a pic on social media.