కత్తిలాంటోడులో బర్నింగ్ స్టార్

Sampoornesh Babu To Act In Chiru 150th Film

10:44 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu To Act In Chiru 150th Film

మెగాస్టార్ చిరంజీవి 150 మూవీగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. తాజాగా వచ్చిన మరో న్యూస్ ప్రకారం ఈ మూవీలో కమెడియన్ గా సంపూర్ణేష్ బాబుని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. కొద్దిరోజుల కిందట సంపూ నటించిన కొబ్బరిమట్ట ట్రైలర్ ని క్షుణ్నంగా చూసిన మెగాస్టార్ అందులోని డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేశాడట. తన మూవీలో ఈ కమెడియన్ అయితే బాగుంటుందని డైరెక్టర్ చెవిలో పడేశాడని, పైగా రెమ్యూనరేషన్ కూడా సంపూ మిగతావాళ్ల మాదిరిగా డిమాండ్ చేసేవాడు కాదని అన్నట్లు కూడా టాక్ వచ్చింది.

ఇప్పటికే కొన్నిడైలాగ్స్ సంపూతో చేయించడం, అంతా ఓకే అయిందని, వీలైతే బర్నింగ్ స్టార్ సంపూ కత్తిలాంటోడు రేపోమాపో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమంటున్నారు. తొలుత సునీల్ ని యూనిట్ సంప్రదించిందని, కాల్షీట్లు లేకపోవడంతో వెన్నెల కిషోర్ , అలీతో దాన్ని భర్తీ చేయాలని అనుకున్నట్లు చక్కర్లు కొట్టాయి. ఇంతలో సంపూ కొబ్బరిమట్ట ట్రైలర్ చిరుని ఇంప్రెస్ చేయడంతో అటువెపు మొగ్గుచూపినట్టు వార్తలు అందుతున్నాయి. రూమర్స్ రావడంలో టాలీవుడ్ కూడా తక్కువేమీ తినిలేదని పలు ఘటనలు నిరూపిస్తున్న నేపథ్యంలో మరి కత్తిలాంటోడు లో సంపూ యాక్షన్ ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:అజిత్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు పవన్ దిమ్మతిరిగే ఆన్సర్!

ఇవి కూడా చదవండి:కలతలు లేని కాపురంలో విడాకుల గొడవ

English summary

Mega Star Chiranjeevi was decided to act under the direction of Director V.V.Vinayak in the film named "Kathilantodu" and now according to a recent gossip that Tollywood Comedy Hero Burning Star Sampoornesh Babu was going to act in Chiranjeevi 150 th film.