కబాలిపై సంపూ కామెడీ కామెంట్ కి ఫుల్ మైలేజి

Sampoornesh Babu tweet on Kabali and Sardar Gabbar Singh

03:40 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu tweet on Kabali and Sardar Gabbar Singh

ప్రస్తుతం తనదైన మార్కు కామెడీతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తున్న సోషల్ మీడియా హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. సంపూర్నేష్ సినిమాల్లోకి రాకముందు కూడా సోషల్ మీడియాలో తనదైన మార్కు పోస్టులతో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంపూ తాజాగా సూపర్ స్టార్లకు - పవర్ స్టార్ కు సంబంధించిన విషయంపై స్పందించాడు. ఇందులో సైతం తనదైన మార్కు కామెడీని - వెటకారాన్ని పండించాడనే చెప్పాలి. వాస్తవానికి భారీ స్టార్స్ - భారీ సినిమాలపై ఇండస్ట్రీలోని వారే బహిరంగంగా కామెంట్ చేసే సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసింది సంపూ కాబట్టి.. అంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఇది సంపూ మార్కు సెటైరైనా.. వాస్తవమైతే దాగుందిగా అనేది సంపూ ఫ్యాన్స్ వాదన. అసలు సంపూ ఏమన్నాడంటే...

ఈ 2016 కి ఏమైంది? ఓ పక్క సర్దార్ గబ్బర్ సింగ్ - మరోపక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష ధోరణికి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం అని సంపూ తాజాగా ట్వీట్ చేశాడు. ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో విడుదలవుతున్న భారీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో సంపూ చేసిన ట్వీట్ కి ఫుల్ మైలేజ్ వచ్చింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూనే.. తన కొబ్బరి మట్ట సినిమాను తనదైన శైలిలో సంపూ ప్రమోట్ చేసుకుంటున్నాడు.

English summary

Sampoornesh Babu tweet on Kabali and Sardar Gabbar Singh