సామ్‌సంగ్‌ నుంచి ఏ5, ఏ7(2016) స్మార్ట్ ఫోన్లు

Samsung A5,A7 2016 Smartphones

11:26 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Samsung A5,A7 2016 Smartphones

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ సామ్‌సంగ్‌ మరో రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన సామ్‌సంగ్‌ ఫోరమ్‌ ఈవెంట్‌లో భాగంగా గెలాక్సీ ఏ7(2016), గెలాక్సీ ఏ5(2016) ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఏ7 ధర రూ. 33,400 కాగా, గెలాక్సీ ఏ5 ధర రూ. 29,400. ఫిబ్రవరి 15 నుంచి ఈ కామర్స్‌ పోర్టల్‌ స్నాప్‌డీల్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

గెలాక్సీ ఏ7(2016) ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్ ప్రొసెసర్‌, 3 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీ సపోర్టింగ్‌, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

గెలాక్సీ ఏ5(2016) ఫీచర్లు ఇవే..

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్ ప్రొసెసర్‌, 2 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్‌ ముందుకెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీ సపోర్టింగ్‌, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

English summary

Worlds Popular electronics company Samsung launched its Galaxy A5 (2016) and the Galaxy A7 (2016) smartphones for India priced at Rs. 29,400 and Rs. 33,400 respectively. The dual-SIM supporting 4G LTE smartphones will be available in the country via Snapdeal and offline retailers starting February 15.