గెలాక్సీ నోట్ 7 ఫోన్లు వాడొద్దంటున్న శాంసంగ్!

Samsung company says that don't use Galaxy note 7

06:42 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Samsung company says that don't use Galaxy note 7

స్వయంగా శాంసంగ్ కంపెనీయే ఇలా అంటోంది. ఎందుకంటే, గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్న నేపథ్యంలో ఈ ఫోన్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సామ్ సంగ్ ఈ అభ్యర్ధన చేసింది. తమ వద్ద ఉన్న ఫోన్లను వీలైనంత త్వరగా మార్చుకోవాలని పేర్కొంది. ఇప్పటికే మార్కెట్లోకి పంపిన ఫోన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని నోట్ 7 ఫోన్లను వినియోగించవద్దని కంపెనీ పేర్కొంది. కాగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు విమానంలో ప్రయాణికులు గెలాక్సీ నోట్ 7ను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసిన శాంసంగ్ దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది.

పాత నోట్ 7 స్థానంలో కొత్త ఫోన్ ను ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేశామని, దీన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని సామ్ సంగ్ మొబైల్ ప్రెసిడెంట్ డాంగ్ జిన్ తెలిపారు. సామ్ సంగ్ సర్వీస్ సెంటర్లకు వచ్చి కస్టమర్లు కొత్త నోట్ 7ను తీసుకువెళ్లవచ్చని, కొత్తది అందుబాటులో లేనిపక్షంలో తాత్కాలికంగా రెంటల్ ఫోన్లను తీసుకోవచ్చని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: షాక్: శ్రీకాంత్ 'మెంటల్' సినిమా డైరెక్టర్ ఆత్మహత్య!

ఇది కూడా చదవండి: బంగారు పతకం గెల్చిన మరియప్పన్ జీవితం గురించి తెలియని విచారకర విషయాలు!

ఇది కూడా చదవండి: అలనాటి అందాల తార రాధా 25వ వెడ్డింగ్ యానివర్సరీ(ఫోటోలు)

English summary

Samsung company says that don't use Galaxy note 7