భారత్ లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న శాంసంగ్

Samsung Completes 20 Years in Inida

04:37 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Samsung Completes 20 Years in Inida

శాంసంగ్.. ప్రపంచంలో టాప్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ. టీవీలు.. ఫ్రీజ్ లు.. వాషింగ్ మెషిన్.. ఏసీ.. మొబైల్స్ ఇలా అన్నింటి తయారీలో తన మార్కు చూపించింది శాంసంగ్. అయితే శాంసంగ్ భారత విపణిలోకి అడుగుపెట్టి డిసెంబర్ 11 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది శాంసంగ్. వివిధ వస్తువులపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు అంటే 20 ఏళ్లకు గుర్తుగా 20 రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ పై 20 శాతం క్యాష్ బ్యాక్, కొన్ని రకాల టీవీలు, ఏసీలు, ఫ్రీడ్జ్ లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఒవెన్లపై 20 ఈజీ ఈఎంఐలపై కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. మై గెలాక్సీ అప్లికేషన్లపై సుమారు 20 ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. అలాగే మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి ఎక్స్ టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే స్పెషల్ వెడ్డింగ్ ప్యాకేజీలను కూడా ఇస్తోంది. ఇంక కొన్ని ఎంపిక చేసిన మోడళ్లకు ఒక ఏడాది వారంటీతో ఒకసారి స్క్రీన్ రీప్లేస్ మెంట్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న వారికి మరో 5 శాతం క్యాష్ బ్యాక్.. శాంసంగ్ స్మార్ట్ క్లబ్ మెంటర్ షిప్ ఉన్న వారికి లాయల్టీ పాయింట్లు అందిస్తోంది.

English summary

World famous electronic company completed 20 years in India.Samsung Celebrates 20 Years in India With Discounts, Cashbacks, and Other Offers