సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 5 వింటర్‌ ఎడిషన్‌

Samsung Galaxy Note 5 Winter Edition Launched

05:01 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Samsung Galaxy Note 5 Winter Edition Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 5 వింటర్‌ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను దక్షిణ కొరియాలో విడుదల చేసింది. 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఈ ఫ్యాబ్లెట్‌ ప్రత్యేకత. సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 5 ఆగస్టులోనే విడుదలైనప్పటికీ 128జీబీ వేరియంట్‌ను వింటర్‌ ఎడిషన్‌గా ఇప్పుడు విడుదలైంది. ఈ ఫ్యాబ్లెట్‌ను తాజాగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. దీని ధర సుమారు రూ.56 వేలు. అయితే ఈ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి రానుందనే విషయం సామ్ సంగ్ వెల్లడించలేదు. 5.7 అంగుళాల క్యూహెచ్ డీ ఆమోల్డ్ డిస్ ప్లే, 2560*1440 పిక్సల్ డెన్సిటీ, 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 16ఎంపీ వెనుక కెమెరా, 5ఎంపీ ముందు కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎక్సినోస్‌ 7420 ఆక్టాకోర్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ , 4జీ సదుపాయం మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

English summary

Samsung Company Launched its new Smart Phone Samsung Galaxy Note 5 Winter edition With 128GB Inbuilt Storage