సామ్‌సంగ్ ఎస్7 ఫోన్ ఎలా ఉండబోతోంది??

Samsung Galaxy S7 Features

05:58 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Samsung Galaxy S7 Features

మొబైల్ ఫోన్ల తయారి రంగంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం ఏర్పరచుకున్న కొరియా మొబైల్ దిగ్గజం సామ్సంగ్ తన కొత్త గాలక్సీ S7 ఫోన్ విడుదల చేయబోతోంది. సామ్సంగ్ గాలక్సీ S సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్ ఫోన్లు అన్నీ ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్ లో మంచి విజయాన్ని అందుకున్నాయి. గాలక్సీ S సిరీస్ లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఫోన్ సామ్సంగ్ గాలక్సీ S6 . ప్రపంచ మొబైల్ మార్కెట్లో S6 మంచి విజయం సాధించింది. ఈ గాలక్సీ S సిరీస్ లో భాగంగా తన తదుపరి గాలక్సీ S7 ఫోన్ ఎలా ఉండబోతోందనే ఆత్రత ప్రపంచ వ్యాప్తంగా ఉంది .

ఈ కొత్త గాలక్సీ S7 వచ్చే సంవత్సరం ఆంటీ 2016 ఫిబ్రవరి లో విదుదల కాబోతున్నట్లు సమాచారం. సామ్సంగ్ గాలక్సీ S7 ,సామ్సంగ్ గాలక్సీ S7 ఎడ్జ్ లాంటి రెండు వెర్షన్ లలో విడుదల చేయ్యనున్నట్లు సమాచారం.
ఈ గాలక్సీ S7 ఫోన్లో ఫీచర్ల విషయానికి వస్తే 5.2 ఇంచుల సామ్సంగ్ వారి ప్రఖ్యాత సూపర్ AMOLED డిస్ప్లే తో మరింత స్పష్టంగా ఈ ఫోన్లో లో వీడియో లు,ఫోటోలు మనం చూడచ్చు. ఆండ్రాయిడ్ మార్ష్ మెలో 6.0 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రానున్నట్టు సమాచారం . 3 జీబి రామ్ , 32 లేదా 64 జీబి ఇంటర్నల్ మెమరీ , 128 జీబి వరకు మైక్రో ఎస్ డి కార్డుతో ఇంటర్నల్ మెమరీ ని పెంచుకునే సౌలభ్యం ఉంది . వెనుక భాగం లో 20 మెగా పిక్సెల్స్ కెమెరా , ముందు భాగంలో 8 మెగా పిక్సెల్స్ కెమెరాలు ఈ S7 ఫోన్లో ఇమిడి ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఎక్సినోస్ 8890 లేదా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో రానున్నట్టు సమాచారం .

ఈ కొత్త సామ్సంగ్ గాలక్సీ S7 లో అత్యధిక భద్రత కలిగిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రాబోతోంది. ఇంకా అత్యధిక క్వాలిటీ కలిగిన 2K రీజల్యుషన్ గల స్క్రీన్ ను ఈ ఫోన్ లో పొందు పరిచారు. అంతేకాక ఇంతకు ముందు ఎన్నడు ఏ ఫోన్ లోను లేని యు ఎస్ బీ- సీ పోర్ట్ ను ఇందులో ఇచ్చారు . ఈ అత్యధునిక ఫీచర్లు కలిగిన ఫోన్ పై మీరు ఓ లుక్కేయండి.

English summary

World Mobile Phones Giant Samsung is releasing its new smart pohone in its most sucessful s series. Samsung S7 is to be released in two versions like S7 and S7 Edge. S7 comes with a finger print sensor,2k resolutin screen and there are lot more features in this Samasung Galaxy S7