శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్

Samsung Galaxy S7, S7 Edge Smartphones

06:05 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Samsung Galaxy S7, S7 Edge Smartphones

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో ఎస్7, ఎస్7 ఎడ్జ్‌ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. మార్చి 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. వీటి ధరను త్వరలోనే శాంసంగ్ వెల్లడించనుంది. మరోవైపు గేర్ 360 పేరిట ఓ 360 డిగ్రీ కెమెరాను కూడా ఆవిష్కరించింది. ఇందులో 30 మెగా పిక్సల్ కెమెరా, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1350 ఎంఏహెచ్ బ్యాటరీ, 0.5 ఇంచ్ పీమోలెడ్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధరను కూడా త్వరలో వెల్లడించనుంది.

గెలాక్సీ ఎస్ 7 ఫీచర్లు ఇవే..

5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎగ్జినోస్ 8890 ఆక్టాకోర్/క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సీ, ఎంఎస్‌టీ పేమెంట్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎగ్జినోస్ 8890 ఆక్టాకోర్/క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సీ, ఎంఎస్‌టీ పేమెంట్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

Samsung company y unveiled its new smartphones In Galaxy Series named Galaxy S7 and Galaxy S7 Edge.These smartphones were showcased in Mobile World Congress in Barcelona.