21న మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్7

Samsung Galaxy S7 To Launch On 21st February

07:09 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Samsung Galaxy S7 To Launch On 21st February

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్7ను ఈ నెల 21న మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ విషయానికి సంబంధించి కంపెనీ ఇప్పటికే ఓ ప్రకటనను జారీ చేసింది. రూ.46 వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

గెలాక్సీ ఎస్7 ఫీచర్లు ఇవే..

5.1 ఇంచ్ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4జీ, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, శాంసంగ్ పే, సూపర్ అమోలెడ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్, 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, వైఫై 802.11 ఏసీ, వైఫై డైరెక్ట్, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, కంపాస్, బారోమీటర్, హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2, క్విక్ చార్జ్ 3.0, 30 నిమిషాల్లోనే 83 శాతం చార్జింగ్ అవుతుంది, వైర్‌లెస్ చార్జింగ్, బ్యాటరీ, కెమెరాల వివరాలను ఇంకా వెల్లడించలేదు.

English summary

Worlds Popular Mobile company samsung to launch its new smartphone in its Galaxy S Series called Galaxy S7 on february 21st. This phone comes with the features like 5.1-inch QHD display,12-megapixel rear camera; 5-megapixel front-facing camera; 64GB inbuilt storage; 4GB of RAM, and Snapdragon 820 processor