స్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ఎలా పేలిపోయిందో చూడండి(వీడియో)

Samsung note 7 was blasted

11:55 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Samsung note 7 was blasted

ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. అయితే వాడడం, ఛార్జింగ్ వంటి విషయాల్లో శ్రద్ధ కనబరచకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. ఇదిగో అందుకు తార్కాణం ఇదే. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో స్యామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలింది. పొగలు కక్కుతున్న ఆ ఫోన్ ను ఎవరో వీడియో తీశారు. యూట్యూబ్ లో ఇప్పుడీ వీడియో హల్ చల్ చేస్తోంది. స్యామ్ సంగ్ నోట్ 7 బ్యాటరీలు హీటింగ్ ప్రాబ్లంతో పేలుతున్న ఘటనలు ఇప్పటికే చాలాచోట్ల జరిగాయి. ఈ ఫోన్ కొన్నవారు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు స్యామ్ సంగ్ కంపెనీ స్పందించింది. తయారీ లోపాలున్నట్లు గుర్తించిన కంపెనీ రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఎవరి డబ్బు వారికి ఇచ్చేసి, ఈ మోడల్ తయారీని నిలిపివేయాలని స్యామ్ సంగ్ భావిస్తోంది. ఈ ఒక్క మోడల్ వల్ల సంస్థకున్న గుడ్ విల్ పోగొట్టుకోవడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో స్యామ్ సంగ్ నోట్ 7 పేలిన వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

Samsung note 7 was blasted