నేడు విడుదల కానున్న గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్లు

Samsung S7 To Release Today

12:38 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Samsung S7 To Release Today

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్లను సోమవారం భారత్ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లను రిలీజ్ చేయనుంది. ఈ నెల మూడో వారం నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.45 వేల నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ ఫోన్లపై డిస్కౌంట్లు, రాయితీలకు అవకాశం కల్పించవద్దని రీటెయిల్ స్టోర్ యాజమాన్యాలకు ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అయితే వీటి మార్కెటింగ్‌కే శాంసంగ్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందని సమాచారం. కాగా గత ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన గెలాక్సీ ఎస్6 కన్నా తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుందట శాంసంగ్.

English summary

Worlds popular Electronics company Samsung to launch two smart phones Galaxy S7, Galaxy S7 Edge Available With Upgrade Programme.