సామ్‌సంగ్‌ నుంచి గేర్ ఎస్ 2 స్మార్ట్‌ వాచ్‌

Samsung Smartwatches Launched

12:08 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Samsung Smartwatches Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ సామ్‌సంగ్‌.. కొత్త స్మార్ట్ వాచ్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. గేర్‌ ఎస్‌2 పేరిట స్మార్ట్‌ వాచ్‌తో పాటు గేర్‌ వీర్‌ హెడ్‌సెట్‌ని అందుబాటులోకి తెచ్చింది. గేర్‌ వీఆర్‌ హెడ్‌సెట్‌ ధర రూ.8,200. గేర్‌ ఎస్‌2 స్మార్ట్‌ వాచ్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లాసిక్‌ వేరియంట్‌ ధర రూ.24,300 కాగా లెదర్‌ బ్యాండ్‌ వేరియంట్‌ ధర రూ.25,800. వీటిని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటిని కొన్ని దేశాల్లో గత ఏడాదే విడుదల చేసినా.. భారత మార్కెట్లోకి ఇప్పుడు ప్రవేశపెట్టింది. స్మార్ట్‌వాచ్‌ ఫీచర్ల ఇవే.. 1.2 అంగుళాల గుండ్రటి డిస్‌ప్లే, 360×360 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, టైజెన్‌ ఆపరేటింగ్‌ సిస్టం, రొటేటింగ్‌ డయల్‌, 1 గిగాహెడ్జ్‌ డ్యూయర్‌ కోర్‌ ప్రాసెసర్‌, 4జీ అంతర్గత మెమొరీ, 512 ఎంబీ ర్యామ్‌, 250ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.

English summary

Popular electronics company Samsung launched two news smart watches named Gear S2, Gear S2 Classic.The price of this smart wathces were Rs. 24,300 and Rs. 25,800 respectively.