స్మార్ట్... స్మార్ట్ గా.. స్మార్ట్ రింగ్ 

Samsung's Smart Ring

05:36 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Samsung's Smart Ring

నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ టెక్నాలజీ. ఈ రంగంలో రోజుకో కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా వచ్చినవే టీవీలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ మొదలైనవి. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచీలు కూడా ఇవే కోవకు చెందుతాయి. ఒక దాన్ని మించిన ఫీచర్లను మరొకటి కలిగి యూజర్లకు సకల సౌకర్యాలను అందిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడవే సదుపాయాలను మరింత చిన్న సైజ్ పరికరంలో వినియోగదారులు పొందనున్నారు. అదే స్మార్ట్ రింగ్ (స్మార్ట్ ఉంగరం). ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లు, గేర్ వీఆర్ హెడ్‌సెట్‌ల తరహాలోనే కొత్తగా స్మార్ట్ రింగ్‌లను రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ ఎలాంటి సమాచారాన్ని ప్రకటించకపోయినా ఈ రింగ్‌కు చెందిన పేటెంట్ హక్కులను రిజిస్టర్ చేసే పనిలో ఆ కంపెనీ బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఈ రింగ్ ను అటు, ఇటు తిప్పడం ద్వారా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ డివైస్‌లను కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ డివైస్ గురించిన పూర్తి వివరాలు, అందుబాటులోకి వచ్చే తేదీ తదితర సమాచారాన్ని శాంసంగ్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

English summary

Samsung electronics company was developing a Smart Ring, with the use of this smart ring we can control our smart phone