శాపానికి గురైన ఒక ప్రేమకథ!

Sanam Teri Kasam first look

03:13 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Sanam Teri Kasam first look

తకిటతకిట, అవును చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు హర్షవర్ధన్‌ రాణే. ఆ తరువాత గీతాంజలి, మాయ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి తన పాపులారిటీని పెంచుకున్నాడు. ఈ హర్రర్‌ చిత్రాల ద్వారానే హర్షవర్ధన్‌కి బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దానితో బాలీవుడ్‌లో నటించే ఆవకాశం అందుకున్నాడు ఈ యువ హీరో. 'సనమ్‌ తేరీ కసమ్‌' అనే లైటిల్‌తో ఈ చిత్రాన్ని రాధికా రావ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ముఖ్య ఉద్ధేశం ప్రతీ ప్రేమకథకు ఏదో ఒక శాపం ఉంటుంది.

'సనమ్‌ తేరీ కసమ్‌' లో జంట కూడా ఒక శాపానికి గురవుతుంది, ఆ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌కు వస్తున్న అనూహ్య స్పందన చూస్తుంటే ఒక ప్రేమ కావ్యంగా ఈ చిత్రం నిలిచిపోతుందన్న ఆలోచన వస్తుంది. మరి ఏమౌతుందో వేచి చూడాలి.

English summary

Sanam Teri Kasam first look. Harshvardhan Rane is acting as a hero in this movie.