సందీప్‌ కిషన్‌ 'నేరం'

Sandeep Kishan To Remake Neram Movie

01:00 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Sandeep Kishan To Remake Neram Movie

స్నేహగీతం సినిమాతో హీరోగా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమైన యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తన నటన తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటాకె.నాయుడు మేనల్లుడు అయిన సందీప్‌ కిషన్‌ తన సొంత టాలెంట్‌ తోనే హీరోగా నిలబడ్డాడు. వెంటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి విజయవంతమైన సినిమాలో నటించి హిట్‌ కొట్టిన సందీప్‌ కిషన్‌ తన టైగర్‌ సినిమా బాక్సాఫీసు వద్ద చతికలపడడంతో కాస్త స్లో అయ్యాడు. తాజాగా ఇప్పుడు సందీప్‌ కిషన్‌ ఒక మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. తమిళ, మళయాళ భాషల్లో మంచి విజయం సాధించిన 'నేరం' అనే చిత్రాన్ని తెలుగులో సందీప్‌ కిషన్‌ రిమేక్‌ చెయ్యనున్నాడు. ఈ రిమేక్‌ కు దర్శకుడిగా కన్నెగంటి వ్యవహరించనున్నారు . కన్నెగంటి ఇంతకు ముందు అసాధ్యుడు, మిస్టర్‌ నూకయ్య వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అయినా సందీప్‌ కిషన్‌ పూర్వవైభావాన్ని తెచ్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

English summary

Tollywood Young Hero is ready to act in a remake film "Neram" which was success full in tamil and malayalam. Director kanneyganti to direct this film