సచిన్ ను టీంలో నుండి గెంటేస్తామని చెప్పాం..

Sandeep Patil sensational comments on Sachin Tendulkar

10:58 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Sandeep Patil sensational comments on Sachin Tendulkar

కొన్ని మాటలు కావాలని అంటారో, అలాంటి అర్ధం తీస్తారో తెలీదు గానీ ఇప్పుడు ఓ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఇలా అన్పిస్తోంది. పైగా ఈయన ఈ తరహా వ్యాఖ్యలు పదవి పోయాక చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. మరాఠీ ఛానల్ ఏబీపీ మజాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంటును ప్రకటించకుంటే, తామే తీసేయాలన్న నిర్ణయానికి వచ్చామని, కానీ అతనే హుందాగా తప్పుకున్నారని చెప్పాడు. డిసెంబర్ 12, 2012న మేము సచిన్ ను కలసి నీ భవిష్యత్ ప్లాన్ ఏంటి? అని అడిగాం.

తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పాడు. అప్పట్లో సెలక్షన్ కమిటీ సచిన్ ను తొలగించాలన్న నిర్ణయానికే వచ్చింది. ఇదే విషయాన్ని సచిన్ కు చెప్పాం. మా ఉద్ధేశాన్ని అర్థం చేసుకున్న ఆయన, తదుపరి సమావేశం జరిగేలోగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒకవేళ అలా చేయకపొతే మేమే ఖచ్చితంగా తొలగించి ఉండేవాళ్లం అని అన్నాడు.

ఇది కూడా చదవండి: నగ్నంగా వేరే వాడికి ఫోటోలు పంపిందని ప్రేమించిన వాడు ఏం చేసాడో తెలుసా?

ఇది కూడా చదవండి: తాజ్ మహల్ ని మూడుసార్లు అమ్మేసిన ఘనుడు!

ఇది కూడా చదవండి: సాయికుమార్ పై చేయి చేసుకున్న ఎన్టీఆర్!

English summary

Sandeep Patil sensational comments on Sachin Tendulkar. BCCI board member Sandeep Patil shocking comments on Sachin Tendulkar.