ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సాన్‌టినా జోరు

Sania-Hingis Continues Their Wins In Australian Open

04:53 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Sania-Hingis Continues Their Wins In Australian Open

ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ వరల్డ్ నంబర్‌ 1 జోడి సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే సిడ్నీ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుని 11 టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్న సాన్‌టినా జోడి మరో విజయం వైపు దూసుకెళ్తొంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌ రెండో రౌండ్లో ఈ జోడి గెలుపొందింది.

శనివారం జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన కవల సోదరీమణులు నదియా కించెనోక్‌- ల్యుద్మిలా కించెనోక్‌పై 6-2, 6-3 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో ఈ జోడి ఇప్పటివరకు వరుసగా 32 విజయాలను అందుకుంది. మూడో రౌండ్లో రష్యన్‌-ఇటాలియన్‌ జోడి స్వెట్లానా-రాబెర్టా విన్సీతో సాన్‌టినా తలపడనుంది.

English summary

Worlds Number One Doubles Players Sania Mirza and Martina Hingis continues their wins in Australian Open