సాన్ టినాదే ఆస్ట్రేలియా ఓపెన్‌

Sania-Hingis Pair Australian Open Title

10:44 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Sania-Hingis Pair Australian Open Title

సానియామీర్జా-మార్టినా హింగీస్. ప్రస్తుతం టెన్సిస్ లో వరల్డ్ నంబర్ వన్ జంట. గతేడాది నుంచి అలవోకగా విజయాలు సాధిస్తున్న ఈ జోడీ టెన్నిస్‌ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. వరుసగా ఏడు టైటిళ్లు దక్కించుకున్న ఈ జోడి.. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ రూపంలో మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ జోడీకి ఇది మూడో గ్రాండ్‌స్లమ్‌ టైటిల్ కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో సాన్‌టినా ద్వయం ఆంద్రియా- లూసీ హ్రదేకాపై 7-6, 6-3తో గెలుపొందింది. దీంతో వరుసగా ఎనిమిదో టైటిల్‌ను దక్కించుకుందీ జోడి. ఈ గెలుపుతో సాన్‌టినా ఖాతాలో వరుసగా 36 విజయాలు చేరాయి. గత 26 ఏళ్లలో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు.. మరో సరికొత్త రికార్డుకు సిద్ధమవుతున్నారు. మరో ఐదు విజయాలు సాధిస్తే.. టెన్నిస్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడిగా ప్రపంచ రికార్డు సృష్టించనున్నారు. ఇండో-స్విస్‌ జోడి సానియా-హింగిస్‌లు ఏడాదిన్నర కాలం నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సహా.. తొమ్మిది టైటిళ్లను దక్కించుకున్నారు. అదే ఉత్సాహంతో 2016లోకి అడుగుపెట్టిన ఈ జోడి ఇప్పటికే రష్యా, బ్రిస్బేన్‌ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌తో హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

English summary

World's Number One Doubles Pair Sania Mirza and Martina Hingis Pair won Australian Open 2016 Women's Doubles title.