ఫోర్బ్స్‌ లిస్ట్ లో కోహ్లి, సైనా, సానియా

Sania, Kohli and Saina in in Forbes Asia list

06:05 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Sania, Kohli and Saina in in Forbes Asia list

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, టెన్నిస్‌ అందం సానియామీర్జా, బ్యాడ్మింటన్‌ ఏస్ సైనా నెహ్వాల్‌లకు అరుదైన గుర్తింపు లభించింది. ఆసియాలో 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభావంతులైన స్పోర్ట్స్ పర్సన్స్ గా వీరికి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. భారత్‌, ఇండోనేసియా, చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, జపాన్‌, పాకిస్తాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి మొత్తం 300 మంది క్రీడాకారులను ప్రామిసింగ్‌ యంగ్‌ లీడర్స్‌ అండ్‌ గేమ్‌ ఛేంజర్స్‌ కింద ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఇందులో మొత్తం 56 మంది భారతీయులకు ప్లేస్ లభించింది. జనవరిలో కోహ్లి ఆధ్వర్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్‌ చేసి 20-20 సిరీస్‌ని గెలుచుకుందని ఫోర్బ్స్‌ పేర్కొంది. భారత్‌లో అత్యధికంగా ఆర్జించే ప్రముఖుల్లో కోహ్లి కూడా ఒకడు. గతేడాది ఆయన అత్యధికంగా సంవత్సరానికి 11.3 మిలియన్‌ డాలర్లు ఆర్జించారు. అత్యంత విజయవంతమైన భారత టెన్నిస్‌ క్రీడాకారిణి.. సానియామీర్జా అని, సైనా నెహ్వాల్‌ భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ అని ఫోర్బ్స్‌ వెల్లడించింది.

English summary

Tennis Star Sania Mirza,Cricketer Virat Kohli,Badminton Star Player Saina Nehwal were the top names in the pack of over 50 Indians in Forbes’ inaugural list of top “promising young leaders and game changers” inaugural list of top “promising young leaders and game changers” under the age of 30 in Asia.