సాన్ టీనా జోరుకు బ్రేక్‌

Sania Mirza-Martina Hingis Winning Streak Ends

12:58 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Sania Mirza-Martina Hingis Winning Streak Ends

మహిళ టెన్నిస్ లో గత ఏడాది ఆగస్టు నుంచి కొనసాగుతున్న సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జైత్రయాత్రకు ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. వరుసగా 41 మ్యాచ్‌లు గెలిచి ఆల్‌ టైం రికార్డుకు మూడు మ్యాచ్‌ల దూరంలో ఉన్న ఈ జంట దోహాలో జరిగిన ఖతార్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో పరాజయం పాలైంది. రష్యన్‌ జోడీ ఎలెనా వెస్నినా, దారియా కసక్తినా జోడీ చేతిలో 2-6, 6-4, 10-5 తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌ జోడీ సానియా, హింగిస్‌ పరాజయం పాలయ్యారు. సానియా జంట ఓటమితో 44 వరుస మ్యాచ్‌ల్లో గెలుపొంది జానా నవోత్నా, హెలెనా సుకోవా నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. గత ఏడాది శాన్‌టినా అద్భుత ప్రదర్శనలతో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

English summary

Sania Mirza and her Swiss partner Martina Hingis' 41-match winning streak came to a halt after the world number one women's doubles pair went down fighting in the quarterfinals of the Qatar Open.