తల్లి ఎప్పుడు అవుతారు అని అడిగిన ప్రశ్నకి సానియా మీర్జా షాకింగ్ ఆన్సర్

Sania Mirza slams journalist

10:50 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Sania Mirza slams journalist

ప్రస్తుత పరిస్థితులలో ఎవరికీ కూడా ఏమాత్రం, ఓర్పు సహనం ఉండడం లేదు. అందునా కొందరు సెలబ్రిటీలైతే అస్సలు విమర్శలు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చి చేరింది. దీంతో మరోసారి ఈమె వార్తల్లో చోటు చేసుకుంది. అయితే ఈసారి ఏకంగా సీనియర్ జర్నలిస్ట్ పై ఆగ్రహంతో ఊగిపోయింది. పరిస్థితిని గమనించి జర్నలిస్ట్.. సారీ చెప్పడంతో ఆమె కాస్త కూల్ అయ్యింది. తన స్పోర్ట్స్ ప్రస్థానంపై ఏస్ అగెనెస్ట్ ఆడ్స్ పేరిట రాసిన బుక్ ఇటీవలే హైదరాబాద్ లో రిలీజైన సంగతి తెల్సిందే! బుక్ ప్రమోషన్ లో భాగంగా నేషనల్ టీవీ ఛానెళ్లకు సానియా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఇండియాటుడే-ఆజ్ తక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు కొన్ని క్వశ్చన్స్ సంధించారు. లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? మదర్ గా ఎప్పుడు? అంటూ ప్రశ్నించడంతో మనసు నొచ్చుకున్న సానియా, రాజ్ దీప్ పై ఆగ్రహాంతో ఊగిపోయింది. తాను సాధించిన టైటిల్స్ కనిపించడం లేదా? అని ఎదురు ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆమె సమాధానం విన్న రాజ్ దీప్, ఇంటర్వ్యూని కొనసాగిస్తూ సానియాకు సారీ చెప్పారు. తాను వేసిన ప్రశ్నలను ఇప్పటిదాకా ఏ మెన్ ప్లేయర్ కీ వేయలేదని చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడిన సానియా, సీనియర్ జర్నలిస్ట్ చేత సారీ చెప్పించు కోగలిగానంటూ సరదాగా అనడం కొసమెరుపు.

English summary

Sania Mirza slams journalist