హింగిస్‌పై సానియాదే విజయం

Sania Wins Over Hingis In Mixed Doubles Match

04:55 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Sania Wins Over Hingis In Mixed Doubles Match

ఆస్ట్రేలియా ఓపెన్‌లో జరిగిన ఓ పోరు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. టెన్నిస్ లో మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ జోడిగా కొనసాగుతున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్‌ ప్రత్యర్థులుగా తలపడటమే ఈ మ్యాచ్ ప్రత్యేకత. అయితే ఈ మ్యాచ్‌లో సానియానే పైచేయి సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హింగిస్‌ జోడిని ఓడించిన సానియా సెమీస్‌కు చేరుకుంది. ఏడాదిన్నర నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్న జోడి సాన్‌టినా. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తమ తమ భాగస్వాములతో కలిసి పోటీపడ్డారు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో లియాండర్‌ పేస్‌-మార్టినా హింగిస్‌ జోడిపై 7-6, 6-3 వరుస సెట్లతో సానియా-డొడిజ్‌(క్రొయేషియా) జోడి గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా.. సాన్‌టినా జోడీ మహిళల డబుల్స్‌లో టైటిల్‌ అడుగు దూరంలో ఉంది.

English summary

An interesting match has attracted all the tennis fans in Australian Open. Sania Mirza-Ivan Dodig defeated Leander Paes-Martina Hingis in mixed doubles match in Autralian open.By defeating Martina hingis pair in quarters Sania pair enters into Semi finals in Australian open