'సర్దార్'లో సంజనకి ఆఫర్‌!!

sanjana in sardar gabbarsingh movie

06:14 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

sanjana in sardar gabbarsingh movie

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' పవర్‌ ఫేమ్‌ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మొదటిసారి పవన్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లక్ష్మీరాయ్‌ కూడా ఒక పాటలో కనిపించడమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తోంది కూడా. ఈ చిత్ర ఘాటింగ్‌లో కాజల్‌, బ్రహ్మానందం, పవన్‌కళ్యాణ్‌ పై హాస్య సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బుజ్జిగాడు, యమహోయమ: చిత్రంలో నటించిన సంజనని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో ఒక ముఖ్యమైన పాత్రకోసం ఎంపిక చేశారు. ఇందులో సంజన పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ముఖ్యమైన పాత్రని సమాచారం.

సంజనతో త్వరలో కొన్ని సీన్స్‌ చిత్రీకరిస్తారట. పవన్‌కళ్యాణ్‌ తో నటించే అవకాశం వచ్చినందుకు సంజన తెగ సంబర పడిపోతుందట. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చారు. సమ్మర్‌ కానుకగా మే లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు.

English summary

sanjana in sardar gabbarsingh movie