'సంజయ్‌దత్‌' విడుదలౌతాడా??

Sanjay Dutt to be released from jail

04:27 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Sanjay Dutt to be released from jail

బాలీవుడ్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ 5 సంవత్సరాల వ్యవధి ని పూర్తి చేసుకుని ఎర్వాడ జైలు నుంచి ఫిబ్రవరి 25న బయటకు వస్తున్నాడు. అతను దాదాపు మూడున్నర నెలల ముందు విడుదలవుతున్నాడు. ఎందుకంటే జైలులో అతని సత్పప్రవర్తనకు ప్రతిఫలంగా ఆయనకు శిక్ష తగ్గించారు. మహారాష్ట్ర జైలు మ్యాన్యూవల్ ప్రకారం ప్రతీ ఖైదీకి సత్పప్రవర్తన కారణంగా సంవత్సరానికి 30 రోజులు శిక్షను తగ్గిస్తారు. సుప్రీంకోర్టు 2013 లో సంజయ్‌ దత్‌ నేరము పై శిక్ష విధించింది. అక్రమ ఆయుధం అతని దగ్గర ఉన్న కారణంగా 1993 బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు అతనిని దోషిగా నిర్ధారించి 5 ఏళ్ళు ఖైదు విధించింది.

అతనికి 2014 లో 14 రోజులు శెలవు మంజూరు చేసిన తర్వాత జైలుకు తిరిగిరావడం ఆలస్యం అవ్వడం కారణంగా విడుదలకు ఆలస్యమయింది. ఏమయినప్పటికీ సంజయ్‌దత్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.

English summary

Sanjay Dutt is releasing from jail after the five years. He is releasing on February 25th from Yerwada jail.