పీవీ నరసింహారావుకు భారత రత్న ఖాయమా?

Sanjaya Baru favours Bharat Ratna for Ex PM PV Narasimha Rao

11:05 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Sanjaya Baru favours Bharat Ratna for Ex PM PV Narasimha Rao

భారత మాజీ ప్రధాని - తెలుగు తేజం - దివంగత పీవీ నరసింహారావుకు భారత రత్న పురస్కారం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పివి స్మారక చిహ్నం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని చూస్తున్న బిజెపి సర్కార్ దేశ అత్యున్నత పురస్కారం కూడా అందించే దిశగా అడుగు వేస్తొందా అంటే అవుననే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఈ అంచనాలు వేస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన చేసిన కృషికి ఫలితంగా ఎన్డీయే ప్రభుత్వం పీవీకి అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు వినిపిస్తోంది కూడా. కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ దేశాన్ని పాలించినా ఆయన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి తీవ్ర విమర్శల పాలైంది. చివరికి మరణానంతరం కూడా పీవీని అగౌరవపరిచారన్న ఆగ్రహం కూడా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో పీవీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం కాంగ్రెస్ కు చెంపదెబ్బ కొట్టినట్లవుతుందని అంటున్నారు.

ఇక్కడ విషయం ఏమంటే, పీవీకి భారత రత్న ఇస్తారన్న అంచనాలపై బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా సంజయ్ బారు ఈ అంచనాలు కరెక్ట్ అనిపిస్తోంది. యాక్సిడెంటర్ పీఎం అంటూ మన్మోహన్ పై పుస్తకం రాపి సంచలనం రేపిన సంజయ్ బారు పీవీకి భారతరత్న వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అధ:పాతాలానికి వెళ్లే సమయంలో పీవీ చేసిన సంస్కరణలు - పనులతో ఆర్థికంగా వృద్ధి చెందినందుకుగానూ ఆయనకు అత్యున్నత పురస్కారం ఇచ్చే అవకాశాలున్నాయని బారు ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

మన్మోహన్ తో కలిసి పనిచేసిన బారు ఆయనకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయగా... ప్రస్తుతం పీవీని మాత్రం పొగడ్తలతో ముంచేస్తున్నారు. పీవీ నాయకత్వ లక్షణాలతోనే కాంగ్రెస్ ఎంపీలు 1991లో ఆయన్ను ప్రధానిగా ఎన్నుకున్నారే తప్ప, నామినేటెడ్ పదవులా మాత్రం రాలేదని బారు గుర్తుచేస్తున్నారు. ఇక పీవీ విషయంలో కాంగ్రెసేతర పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి కూడా. పీవీని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం - టీఆరెస్ పార్టీ కూడా తెలంగాణ బిడ్డగా గౌరవిస్తోంది. ఇదే పద్ధతిలో బీజేపీ కూడా దేశానికి సంస్కరణల దారి చూపిన దార్శినికుడిగా కీర్తిస్తోంది. సో .. పీవీని భారతరత్న వంటి అత్యున్నత పురస్కారంతో గౌరవించినా ఏమాత్రం ఆశ్చర్య పోనవసం లేదని పలువురు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:20 రూపాయలకే 100 ఛానెల్స్

ఇవి కూడా చదవండి:చిన్నారికి ప్రధాని మోడీ రాసిన లేఖలో ఏముంది?

English summary

Ex-Prime Minister Manmohan Singh's Media Adviser Sanjay Baru says that BJP Government was going to present Bharata Ratna to Indian Ex-Prime Minister PV. Narasimha Rao.