షాకింగ్ న్యూస్: తెలంగాణా అడవుల్లో సంజీవిని లభ్యం

Sanjeevani found in Telangana forests

04:52 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Sanjeevani found in Telangana forests

రామ-రావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడికి ఆంజనేయుడు సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణుడికి తెలివి తెప్పించినట్టు రామాయణం చెబుతోంది. అయితే, ఆంజనేయుడికి ఆ మొక్క ఎక్కడ ఉందో తెలియక మొత్తం పర్వతాన్నే పెకలించుకుని వెళ్లినట్టు కూడా రామాయణంలో ఉంది. పురాణాల్లో ప్రస్తావించిన అద్భుత ఔషధి సంజీవని అన్వేషణకు రూ.150 కోట్లు ఇవ్వాలని ఉత్తరాఖండ్ మంత్రి కేంద్రాన్ని అడిగారుగానీ.. ఆ లక్షణాలన్నీ ఉన్న సెలగినెల్లా బ్రైయాప్టెరిస్ మొక్కను తెలంగాణలో గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం తిరుమలయ్య గుట్టపై ఉన్న ఈ మొక్కలను వనపర్తి డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య నాలుగేళ్ల క్రితమే కనుగొన్నారు.

ఈ గుట్టపై ఉన్న అపారమైన ఔషధ మొక్కలను గుర్తించేందుకు ఆయన విద్యార్థులతో కలిసి పరిశోధించారు. ఆ క్రమంలోనే ఆయన దీన్ని గుర్తించారు. వృక్ష జాతులపై పరిశోధనలు చేయడానికి ఆసక్తి కలిగిన మావంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే అరుదైన సంజీవని వంటి మొక్క, మూలిక జాతులను లెక్కకు మించి కనిపెడతాం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అటవీ ప్రాంతంలో పరిశోధనలు చేయడానికి అనుమతులు ఇచ్చి, తోడ్పాటునందిస్తే పాలమూరు జిల్లా అడవుల్లో ఉన్న అనేక రకాల ఔషధ మొక్కలను గుర్తిస్తామని సదాశివయ్య తెలిపారు.

సంజీవని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:

1/5 Pages

ఉత్తరాఖండ్‌ లోని ద్రోణగిరిలో:

హిమాలయాల ఒడిలోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలో ద్రోణగిరి పర్వతాలున్నాయి. ఇందులోని ఒక కొండనే హనుమంతుడు తీసుకెళ్లాడని స్థానికుల విశ్వాసం. దీంతో ఈ పర్వతాలపైన, అక్కడ లభించే మొక్కలపైనా ఎంతో కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సంజీవని కోసం వెతకాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2009వ సంవత్సరంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణ కొందరు ఆయుర్వేద వైద్యులను వెంటబెట్టుకుని ఈ పర్వతాలపై సంజీవని కోసం గాలించారు. ఈ ప్రయత్నంలో తాము ఆరు రోజుల్లోనే విజయం సాధించామని.. సంజీవని దొరకకపోయినా, దాని వర్గానికే చెందిన మరో రెండు మొక్కలు లభించాయని ఆయన ప్రకటించారు.

English summary

Sanjeevani found in Telangana forests