పవన్ ని చూసి ఆశ్చర్యపోయా..

Sanjjana Shocks By Seeing Pawankalyan Acting

12:22 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Sanjjana Shocks By Seeing Pawankalyan Acting

"పవన్ కళ్యాణ్" , ఈ పేరు వింటే అభిమానుల్లో ఒక తెలియని కొత్త ఉత్సాహం మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ కు అనేక మంది అభిమానులున్నారు , పవన్ కళ్యాణ్ ని దేవుడి గా కుడా భావించే ఫ్యాన్స్ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. తమ ఆడియో ఫంక్షన్లకు పవన్ రావకపోయినా పవన్ ఫోటోను పెట్టి మరీ నేటి తరం కుర్ర హీరోలు పవన్ కళ్యాణ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్న సందర్భాలు అనేకం. రాజకీయాలలో సైతం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తన నటనతోనూ , తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్నతాజా చిత్రం "సర్దార్‌ గబ్బర్‌సింగ్‌". ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను హీరో రవితేజతో పవర్ సినిమా తీసి పాపులర్ అయిన దర్శకుడు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా హీరోయిన్లు కాజల్ , రాయి లక్ష్మి ,సంజన లు నటిస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నకన్నడ ముద్దుగుమ్మ సంజన మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ తో పవన్ కళ్యాణ్ నటన చూసి తాను , తనతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పవన్ నటన చూసి ఆశ్చర్యపోయామని చెబుతోంది. ఒకే లొకేషన్ లో ఒక చోట ఫైట్ , ఇంకో చోట పాత .. వేరే చోట ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించారని , ఇలా మూడు రకాల పాత్రలలో పవన్ కళ్యాణ్ ఆదరగోట్టేసాడని చెప్పుకొచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమానూ వచ్చే నెల 8న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. సర్దార్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాను హిందీ భాషలో సైతం డబ్ చేసి తెలుగు , హిందీ భాష లలో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇలా తెలుగు , హిందీ భాష లలో ఒకేసారి విడుదలవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

English summary

Power Star Pawan Kalyan's upcoming movie was Sardar Gabbar Singh.This movie was directing by Director Babi.Kajal Agarwal,Sanjjana,Rai Lakshmi we acting as heroines in Sardar Gabbar Singh Film.Sanjjana Says that she was shocked by seeing Pawan Kalyan's performance During Sardar Movie Shooting.This movie was going to Dub in Hindi and going to release on April 8th.