ఓవర్సీస్‌ లో శంకరాభరణం హంగామా!

sankarabharanam releasing most theatres in Overseas

05:34 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

sankarabharanam releasing most theatres in Overseas

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సస్ సూర్య వంటి హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్న హీరో నిఖిల్‌ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం 'శంకరాభరణం' మరి కొన్ని గంటల్లో విడుదలవుతుంది. ఈ సినిమా కి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఏర్పడింది. నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఒక్క అమెరికాలోనే సుమారు 80 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది. అమెరికాతో పాటు స్పెయిన్‌, కెనడా ఇంకా సుమారు ఎనిమిది దేశాల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

సినిమా ఫ్లాప్‌ అయినా సరే ఓపెనింగ్స్‌ మాత్రం అదిరిపోవడం ఖాయమని చెప్తున్నారు సినీ ప్రముఖులు. ఒక వేళ సినిమా అనుకున్నట్లే హిట్‌ అయితే హీరోహీరోయిన్లతో కలిసి కోన వెంకట్‌ అమెరికాలో ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా హిట్‌ అయితే నిఖిల్‌ రేంజ్‌ అమాతంగా పెరిగిపోవడం ఖాయం.

English summary

Sankarabharanam releasing most theatres in Overseas. In America the movie is releasing nearly in 80 theatres.