'శంకరాభరణం'కి చెక్ పెట్టిన సూర్య!!

sankarabharanam team feared with surya's memu movie

06:47 PM ON 21st November, 2015 By Mirchi Vilas

sankarabharanam team feared with surya's memu movie

నిఖిల్, నందిత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం శంకరాభరణం. ఇది ఒక క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందింది. ఇందులో అందాల నాటి అంజలి ముఖ్యపాత్రలో నటించింది. ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత 'కోనవెంకట్' కథ అందించడమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇటీవలే శంకరాభరణం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయగా, ధీం సాంగ్ ను నాగచైతన్య రిలీజ్ చేశారు. శంకరాభరణం డిసెంబర్ 4న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోని శంకరాభరణం టీమ్ తాజాగా సూర్య నటించిన 'మేము' చిత్రంతో షాక్ తగిలింది.

తమిళంలో అగ్రకథానాయకుడైన సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతీ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. తాజాగా సూర్య, అమలాపాల్ నటించిన పిల్లల చిత్రం 'పసంగ-2'. ఈ చిత్రాన్ని 'మేము' పేరుతో తెలుగులో డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. నిఖిల్ పెద్ద హీరో కాకపోవడంతో మేము చిత్రం వల్ల శంకరాభరణం పై ఎఫెక్ట్ పడుతుందని భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శంకరాభరణం టీమ్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

English summary

sankarabharanam team feared with surya's memu movie