ముందు అబ్బాయి - తర్వాతే బాబాయి ....

Sankranthi Movies Updates

09:46 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Sankranthi Movies Updates

ఇప్పటికే సంక్రాంతి రేసులో రూ. 130 కోట్ల బడ్జెట్ చిత్రాలు వున్నాయి. వేటికవే స్పెషల్ నాలుగు కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి.బాలయ్య డిక్టేటర్ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్ సినిమా అంటున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ గా టాక్. ఇక బాబాయ్ తో సరి సమానంగా అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో. సుమారు ఇంతే బడ్జెట్ సినిమా మరి. స్పెయిన్, లండన్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలే పెట్టేసుకున్నారు. అయితే ముందు 'నాన్నకు ప్రేమతో' విడుదల కానుంది. తర్వాత రోజు 'డిక్టేటర్' వస్తాడు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి సంక్రాంతికి వస్తున్న' నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి దాదాపు 20 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని అంటున్నారు. ఇందులో నాగ్ తన తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు వాడిన పంచె, లాల్చ్జీ ధరించాడట. దీనిపై టాలీవుడ్ లో మంచి టాక్ నడుస్తోంది. శర్వానంద్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజా' మాత్రం స్మాల్ బడ్జెట్ మూవీయే. సుమారు 7 కోట్లతో దీన్ని తీశారట. ఇది కూడా కామెడీ తో కూడిన సరదా సినిమా యే. కొత్త సినిమాలు ఆడే థియేటర్ల దగ్గర సక్రాంతి సందడి పరుచుకోనుంది.

English summary

This Sankranthi festival is going to be rock with latest films .Junior NTR's Nannaku prematho balakrishna's Dictator,Sarwanand's Express Raja,Nagarjuna's Soggade Chinni Nayina films to be released