'మహేష్‌-మురుగుదాస్‌' చిత్రానికి స్టార్‌ కెమెరామ్‌న్‌! 

Santhosh sivan is selected as a cameraman for Mahesh-Murugadoss movie

06:11 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Santhosh sivan is selected as a cameraman for Mahesh-Murugadoss movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌, స్టార్‌ డైరెక్టర్‌ ఎ ఆర్‌ మురుగుదాస్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్క బోతుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ బ్రహ్మూెత్సవం చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది అయిపోయాక మహేష్‌-మురగుదాస్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇందులో మహేష్‌ నిద్రపోతున్న న్యాయవ్యవస్ధను ప్రశ్నించే పాత్రలో నటిస్తున్నారు. ఇది దేశానాకి ఒక మెసేజ్‌ ఇచ్చే చిత్రంగా మురుగుదాస్‌ కధని ఎంతో ఆసక్తిగా రెడీ చేస్తున్నాడు. ఒక పక్క స్క్రిప్ట్‌ వర్క్స్‌ చూస్తూనే మరో పక్క సినిమాకి కావాల్సిన టెక్నీషియన్స్‌ని కూడా సిద్ధం చేస్తున్నాడు.

ఈ చిత్రానికి స్టార్‌ కెమెరామ్‌న్‌ మరియు 5 సార్లు నేషనల్‌ అవార్డు అందుకున్న 'సంతోష్‌ శివన్'ని సెలక్ట్‌ చేశారు. ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రాఫర్‌ 'సంతోష్‌ శివన్‌' తనే స్వయంగా ఈ విషయాన్ని అందరిముందు చెప్పాడు. సంతోష్‌ శివన్‌ నేషనల్‌ అవార్డ్స్‌తో పాటు హలీవుడ్‌ లోని 'అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫర్స్‌ అసోసియేషన్'లో మెంబర్‌షిప్‌ పొందిన మొదటి భారతీయ కెమెరామెన్‌ సంతోష్‌ శివన్‌ కావడం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌ 2016 ఏప్రిల్‌లో స్టార్ట్‌ అవుతుంది.

English summary

Santhosh sivan is selected as a cameraman for Mahesh-Murugadoss movie.