ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌లో చేరిన సాన్-టినా

Santina Enters Into Australian Open Finals

11:43 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Santina Enters Into Australian Open Finals

మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ సానియా-హింగిస్‌ ఈ ఏడాదిలో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కు మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. ప్రస్తుత ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్‌కు ఈ జోడీ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో గోర్జెస్‌-ప్లిస్కోవా జోడీపై సానియా-హింగిస్‌ జంట 6-1, 6-0 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. ఏడాదిన్నర కాలంగా ఓటమే ఎరుగని సాంటినా ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ అలవోక విజయాలతో ఫైనల్‌కు చేరింది. భారత్‌-స్విట్జర్లాండ్‌ జోడీకి ఇది వరసగా 35వ మ్యాచ్‌ విజయం. సానియా-హింగిస్‌లకు ఇది మూడవ గ్రాండ్‌ స్లామ్‌ టోర్ని ఫైనల్‌. 2015 చివరిలో వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ల్లో ఫైనల్‌కు చేరుకున్న సానియా-హింగిస్‌ జోడీ ఆ టోర్నీల్లో టైటిల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో చెక్‌ రిపబ్లిక్‌ కు చెందిన 7వ సీడ్‌ అండ్రియా హ్లవచెకోవా-లూసీ హ్రదెక్క జోడీతో సానియా-హింగిస్‌ తలపడతారు.

English summary