కమీడియన్ 'సప్తగిరి' పారితోషికం ఎంతో తెలిస్తే షాకౌతారు!

Sapthagiri remuneration per day

12:24 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Sapthagiri remuneration per day

మొదట దర్శకుడిగా ప్రయత్నించి ఆ తరువాత కమీడియన్ గా మారిన నటుడు సప్తగిరి. 'పరుగు' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన సప్తగిరి ఆ తరువాత 'కందిరీగ' చిత్రంలో 2 నిముషాలు పాత్రే చేసినా గుర్తుండిపోయే పాత్ర చేసి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాడు. ఆ తరువాత 'ప్రేమకధా చిత్రమ్' సినిమాలో పూర్తి కమీడియన్ పాత్ర చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. దీని తరువాత సప్తగిరికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవ‌ల టాలీవుడ్‌ లో చాలా మంది సీనియ‌ర్ కమీడియ‌న్లు వ‌రుస‌గా చ‌నిపోతున్నారు. దీంతో మ‌రికొంద‌రు సీనియ‌ర్ క‌మీడియ‌న్లు బోర్ కొట్టేయ‌డంతో యంగ్ క‌మీడియ‌న్లను చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం స‌ప్త‌గిరి టాలీవుడ్‌ లో చిన్న సినిమాల‌కు స్టార్ క‌మీడియ‌న్ అయిపోయాడు. డిమాండ్ బాగా పెరిగిపోవ‌డంతో స‌ప్త‌గిరి రెమ్యూన‌రేష‌న్‌ ను ప‌ర్ డేగా డిసైడ్ చేశాడ‌ట‌. స‌ప్త‌గిరి రోజుకు ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ తీసుకుంటున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ సమాచారం. మ‌రీ చిన్న సినిమాలు అయితే ల‌క్ష‌ రూపాయలు.. కాస్త పెద్ద సినిమాలు అయితే ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. త‌న రేటు మాత్రం త‌గ్గేది లేద‌ని చెప్ప‌డంతో చిన్న నిర్మాత‌లు షాక్ అవుతున్నా స‌ప్త‌గిరికి ఉన్న క్రేజ్ ను దృష్తిలో పెట్టుకుని స‌ప్త‌గిరి అడిగిన పారితోషికం ఇచ్చేస్తున్నార‌ట‌.

English summary

Sapthagiri remuneration per day. Top comedian Sapthagiri remuneration per day is 1 lakh.