100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘సరైనోడు’

Sarainodu movie collected 100 crores gross

12:46 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Sarainodu movie collected 100 crores gross

స్టైలిష్‌ స్టార్ అల్లుఅర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రానికి అన్నిచోట్లా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కేవలం పదిరోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 53.78 కోట్ల షేర్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు అల్లుఅర్జున్ స్వయంగా వెల్లడించాడు. విజయవాడలో ఘనంగా నిర్వహించిన ‘సరైనోడు’ సక్సెస్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపాడు. నా కెరీర్‌లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి చిత్రమిది. ఈ క్రెడిట్ నాకు అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ బన్నీ పేర్కొన్నాడు.

మొత్తానికి.. బన్నీ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ అందుకున్నాడు. రిలీజ్ కాకముందు ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనడం, అందుకు తగ్గట్టే ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడంతో దీని పై క్రేజ్ మరింత పెరగడంతో పాటు వేసవి సెలవులు కలిసి రావడంతో ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

English summary

Sarainodu movie collected 100 crores gross. Sarainodu movie goes to 100 crores gross collections.