అల్లుఅర్జున్ రకుల్ లు బొలీవియా ఎందుకు వెళ్ళినట్లు.?

Sarainodu Movie Shooting In Bolivia

02:55 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Sarainodu Movie Shooting In Bolivia

రేసు గుర్రం , సన్ అఫ్ సత్యమూర్తి , రుద్రమ దేవి వంటి వరుస హిట్ల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం "సరైనోడు". మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన మార్క్ చూపించే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యంగ్ హీరో ఆది పిన్ని శెట్టి ఈ చిత్రంలో విలన్ గా కనిపించడం మరో హైలైట్ . సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ థెరీసా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి బొలివీయా వెళ్ళింది.

హీరో అల్లు అర్జున్ , హీరో రకుల్ ప్రీత్ సింగ్ , డైరెక్టర్ బోయపాటి శ్రీను లతో పాటు సరైనోడు సినిమా సభ్యులంతా ఉన్న ఫోటోను సరైనోడు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇలా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary

After the Success of Race Gurram,Son Of Satyamurthy and Rudrama Devi films Stylish Star Allu Arjun was acting in Sarainodu movie under the direction of Boyapati Srinu.This movie unit went to Bolivia for shooting schedule and shares their photo with fans via social media.