బన్నీ మూవీకి బంపర్ ఆఫర్

Sarainodu Satellite Rights Sold For 16 Crores

10:00 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Sarainodu Satellite Rights Sold For 16 Crores

సినిమాల శాటిలైట్ హక్కులు కూడా మంచి లాభాల్ని తెచ్చి పెడ్తున్నాయి. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త మూవీ ‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ కళ్ళు తిరిగేంత ధరకు అమ్ముడుపోయినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం వెర్షన్స్‌కు సంబంధించి శాటిలైట్ హక్కులను సన్ నెట్‌వర్క్స్ దాదాపు రూ.16 కోట్లకు సొంతం చేసుకుందట. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి శాటిలైట్ రెవిన్యూ సాధించడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ నెల 22న విడుదల కానున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లు. బోయపాటి శ్రీను మాస్ మసాలా మార్క్ చిత్రమిది.

ఇవి కూడా చదవండి: పవన్-ఎస్.జే.సూర్య ల సినిమా టైటిల్ ఫిక్స్

కేరళలో బన్నీ మూవీలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాన్ని మలయాళంలోనూ డబ్ చేశారు. తెలుగు వెర్షన్‌ని ప్రపంచ వ్యాప్తంగా రెండువేల స్క్రీన్స్‌లో విడుదల చేయాలన్నది మేకర్స్ యోచన. ఇప్పటికే ‘సరైనోడు’ సినిమా సుమారు 50 కోట్ల ప్రీ -రిలీజ్ బిజినెస్ చేసింది..

ఇవి కూడా చదవండి:

ప్రియుడు కోసం కూతురు, అత్తను చంపేసింది

పవన్ పై మహేష్ బావ ఫైర్

ఇలా అయితే మా పరిస్థితేంటంటున్నసుమ

English summary

Stylish Star Allu Arjun's upcoming movie Sarainodu movie was creating hype in the industry. This movie Satellite Rights were sold to an record amount of 16 crores by Sun Network. This movie was going to release on April 22nd.