సరైనోడు స్టోరీ లీక్

Sarainodu story leaked

02:48 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Sarainodu story leaked

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెసా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్, కేధరిన్ త్రెసా పాత్రలు లీక్ అయ్యాయి. ఇందులో కేధరిన్ త్రెసా ఎమ్మెల్యేగా నటిస్తుందట. కేధరిన్ కి బాడీ గార్డ్ గా అల్లు అర్జున్ ఇందులో నటిస్తున్నాడట. అంతే కాదు ప్రత్యర్ధుల నుండి అనుక్షణం కేధరిన్ ని బన్నీ కాపాడతాడని సమాచారం. ఏప్రిల్ 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది.

English summary

Sarainodu story leaked. Allu Arjun upcoming movie Sarainodu story is leaked. This movie is directed by Boyapati Srinu. In this movie Catherine Tresa is acting as a MLA.