శరత్ కి అగ్ని పరీక్ష

Sarath Kumar worrying about his Political Career

02:39 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Sarath Kumar worrying about his Political Career

వెండితెర నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నటుల్లో కొడితే, హిట్ లేదంటే ఫట్. అంతెందుకు సినిమాలైనా అంతేకదా. తమిళనాట ఎంజిఆర్ , తెలుగునాట ఎన్టిఆర్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఆతర్వాత కాంగ్రెస్ లో కలిపెసాడు. అంతకుముందే తమిళనాట శరత్‌ కుమార్‌ పార్టీ పెట్టి, క్లిక్ అవ్వలేదు. శరత్ స్థాపించిన పార్టీ అఖిల భారత సమత్తువ మక్కల్‌ కట్చి (ఎస్‌ఎంకే) పార్టీ 2007 ఆగస్టు 31వ తేదీన ఆవిర్భవించింది. 'కామరాజ్ నాడార్ పాలన తెస్తాం... అబ్దుల్‌ కలాం లక్ష్యాలను సాధిస్తాం' అనే నినాదంతో తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేసిన శరత్ ఇప్పుడు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు. అసలు పార్టీ స్థాపించిన కేవలం 10 నెలల్లోనే పార్టీలోని కీలక నేతలంతా జారుకున్నారు. అపుడే పార్టీలో తొలి చీలిక ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్నా, అసలు కష్టం వెంటాడుతోంది.

వాస్తవానికి పార్టీని స్థాపించిన సమయంలో శరత్‌ కుమార్‌ డీఎంకేతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, 2009లో జరిగిన తిరుచ్చెందూర్‌, వందవాసి ఉప ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించి, బైపోల్‌ ప్రచారం కూడా చేశారు. అదేసంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో స్నేహం చేసి.. తిరునెల్వేలి, తూత్తుకుడి, నామక్కల్‌, తిరుప్పూరు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెంతకు చేరి, ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు రెండాకులపై రెండు స్థానాల్లో పోటీ చేశాడు. ఇందులో తెన్‌కాశి స్థానం నుంచి శరత్‌ కుమార్‌, నాంగునేరిలో ఎర్నావూర్‌ నారాయణన్‌లు బరిలో నిలిచి విజయం సాదించాడు.తానూ గెలిచినా, ఎపుడైతో అమ్మతో చెలిమి చేశాడో, అప్పటివరకు తనకు వెన్నంటి ఉన్న అనేక మంది సీనియర్‌ నేతలు, ప్రముఖులు దూరమయ్యారు. అంతేనా.. వారంతా కలిసి ఇండియా కామరాజర్‌ మక్కల్‌ కట్చి పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టేసారు. దీంతో శరత్ కి దిమ్మ తిరిగిపోయింది. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జయమ్మతో జతగా ఉంటాడో , విడిగా బరిలో దిగుతాడో , తట్టా బుట్టా సర్దేసి, పార్టీని క్లోజ్ చేయడమో , విలీనం చేయడమో చేస్తాడో నని తమిళనాట రసవత్తర చర్చ నడుస్తోంది. తీరిగ్గా సినిమాలు తీసుకోక అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి , పైగా పార్టీ పెట్టి ఇరుక్కున్న శరత్ కష్టాలకు మోక్షం ఎప్పుడో ...

English summary

Ramanathan Sarathkumar (born 14 July 1954) is an Indian film actor, journalist, politician, the former president of the South Indian Film Artistes' Association and former body builder. Sarathkumar has acted in more than 130 Tamil, Malayalam, Telugu and Kannada films. In 2007 Au8gust 31st he started his political party and won only one seat in that elections.Now soo many of his party leaders left his party and now he was worried about her political carrer