షాకిచ్చిన ఐశ్వర్య

Sarbjit movie first look poster

03:22 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Sarbjit movie first look poster

అది మాటల వలన కావచ్చు , చేతల వల్ల అవ్వచ్చు , ఏదో విధంగా ఈ మధ్య ఎక్కడ బడితే అక్కడ షాకులే షాకులు ఇస్తున్నారు కొందరు నటీ నటులు . తాజాగా అందాల రాశి ఐశ్వర్య రాయ్ వంతు అయింది. ‘జజ్బా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరబ్‌జిత్’. మత్తులో పంజాబ్ బోర్డర్ దాటి పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన సరబ్‌జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే తరహా కథతో మేరీకోమ్ సినిమా చేసిన ఓమంగ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా ఐశ్వర్య నటిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వృద్ధురాలి పాత్రలో ఉన్న ఐశ్వర్య లుక్ సినీ అభిమానులకు ఇప్పుడు పెద్ద షాక్ అయింది. అదే స్థాయిలో సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇదివరకు నటనతో, అందాలతో ప్రేక్షకులను రంజింపజేసిన ఐశ్వర్య రీఎంట్రీలో సీరియస్ పాత్రలను చేయడం మామూలు విషయం కానే కాదు. టైటిల్ రోల్‌లో రణదీప్ హుడా నటిస్తున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కి చేరుతుందో.

English summary

Aishwarya Rai Bachchan's upcoming film was "Sarbjit".This movie was based on the story of the man named Sarbjit who had entered into pakistan border by drinking alcohol.Later he was arrested by the pakistan he died in pakistan jail.Randeep hooda was acting as Sarbjit in this movie and this movie first look poster was released by the movie unit.