మే 20న ‘సరబ్‌జీత్‌

Sarbjit Movie To Release On May 20

10:01 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Sarbjit Movie To Release On May 20

రణదీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలుగా రూపుదిద్దుకున్న ‘సరబ్‌జీత్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 20న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. పంజాబ్‌, డిల్లీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ ముంబయిలో జరుగుతోంది. భారత్‌కు చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌ అనే రైతు పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించడంతో ఉగ్రవాదిగా భావించి జైలు శిక్ష వేశారు. శిక్ష అనుభవిస్తూనే అతను మరణించాడు. అతని జీవిత కథ ఆధారంగానే దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో రణదీప్‌ హుడా సరబ్‌జీత్‌ పాత్రను పోషించాడు. అతని సోదరి పాత్రలో ఐశ్వర్య కనిపిస్తుంది.

English summary

Bollywood Queen Aishwarya Rai was presently acting in Sarabjit movie.This Sarbjit movie was based on true story of an farmer who crosses the pakistan border by drinking alcohol..Bollywood Actor Randeep Hooda acted as the brother of Aishwarya Rai in this movie.This movie was going to be released on May 20th.