సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

Sardaar Audio Launch Highlights

10:32 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Sardaar Audio Launch Highlights

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌, కాజల్‌ జంటగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఆడియో విడుదల వేడుక  హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో అంబరాన్ని తాకింది. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్‌మరార్‌, సునీల్‌లుల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు ఈ చిత్ర పవన్‌కల్యాణ్‌ చిత్రాల్లోని పాటలు, అభిమానుల కేరింతలతో ప్రాంగణం హోరెత్తింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరు అయ్యాడు.  సుమ వ్యాఖ్యాతగా వ్యవహ రించింది. పాస్ లున్న వారే వేడుకకు రావాలని ముందుగానే చెప్పడంతో అభిమానులతో ప్రాంగణం కిక్కిర్సి పోయింది. ఈ వేడుకలో ఎన్నో వింతలూ , వినోదాలు చోటుచేసుకున్నాయి.

రాజకీయాల్లో పవన్ శిఖరాలు అందుకుంటాడా!!

వాచీ ఇచ్చిన  మెగాస్టార్ కే టైం ఇవ్వలేదా?

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

1/10 Pages

పవన్ కష్ట పెట్టాం .. క్షమించండి ..

'సర్దార్' సినిమాలో ఫైట్ సీన్ల కోసం ఫైట్స్ కంపోజ్ చేసిన  స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌,లక్ష్మణ్‌లు ఈ సినిమాలో చాలా కష్టమైన ఫైట్స్ చేయించారట. ఈ విషయాన్నీ ఆడియో ఫంక్షన్ లో రామ్ , లక్ష్మణ్ లు వెల్లడించారు. ‘సర్దార్‌..’ చిత్రం కోసం పవన్‌కల్యాణ్‌ను చాలా కష్ట పెట్టాం. ఇందుకు  అభిమానులు క్షమించాలి' వారు చెప్పారు. గత చిత్రం గబ్బర్‌సింగ్‌కు మించిన యాక్షన్‌ సన్నివేశాలు ఇందులో ఉంటాయని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని చేశామని వారు హర్షధ్వానాల మధ్య చెప్పారు. సినిమా చేసే తప్పుడు అనుక్షణం అభిమానులను పవన్ గుర్తుకు తెచ్చుకుంటారని , అభిమానులకోసం తాము కూడా కష్ట పెట్టక తప్పలేదని వారు చెప్పారు. 

English summary

Here are the highlights of Power Star Pawan Kalyan's Sardar Gabbarsingh Movie.Chiranjeevi Attended as a Chief Guest To This Sardaar Gabbar Singh Audio Function. Chiranjeevi Suggested Pawan Kalyan to not to stop films. Soo many celebrities have been complimented Pawan Kalyan In this Audio Function.